ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి
రామాయంపేట,(విజయక్రాంతి): రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ హిమజ్యోతి చెప్పారు. మంగళవారం కళాశాలలో విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన నోట్బుక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాలని చెప్పారు. కళాశాలలో చేరిన విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ బుక్కులు అందచేయడం జరుగుతుందన్నారు.
అనుభవం గల అధ్యాపకులతో విద్యాబోధన అందించడం జరుగుతుందని తెలిపారు. విశాలమైన గదులతో పాటు కంప్యూటర్ శిక్షణ ప్రతి విద్యార్థి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనాలను సైతం మంజూరు చేస్తుందని చెప్పారు .10వ తరగతి పాసైన విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైట్ ప్రిన్సిపాల్, గూడూరి మల్లేశం అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.






