13 April, 2026 | 4:50 AM

స్కాలర్స్ విజయదుందుభి

13-04-2026 03:24 AM

ఉమ్మడి జిల్లాలో కళాశాల విద్యార్థుల ప్రతిభ

వనపర్తి, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): ఇంటర్ ఫలితాల్లో వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన స్కాలర్స్ జూనియర్ కళాశాల విజయదుందుభి మోగించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు మరోసారి ర్యాంకుల పంటను పండించారు. ద్వితీయ సంవత్సరం బైపీసీలో 1000 మార్కులకు గాను బి. మహాలక్ష్మి 993, అలీషా సాజి 992, సుస్మిత 991, బాంధవి 990 మార్కులు సాధించారు.

అలాగే ద్వితీయ సంవత్సరం ఎంపీసీ ఫలితాల్లో కె. నర్మదా 992, కె. శిరీష 991, కె. లలిత 989 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం సిఇసిలో టి. శ్రావణి 771 మార్కులు సాధించగా, ప్రథమ సంవత్సరం బైపీసీలో డి.పల్లవి 437, నిమ్రా అప్సిన్ 437, బి. అక్షయలక్ష్మి 436, భవ్య శ్రీ 434, కె. యామిని 434, సాత్విక 434, కె. రాజేష్ 434, ఇందు 432, అఖిలాండేశ్వరి 432, గేయశ్రీ 432, అఖిల 432 మార్కులు సాధించినట్లు కళాశాల యజమాన్యం తెలిపారు.

ఎంపీసీ లో ఏ బన్నీ 463 మార్కులు సాధించగా జి. హర్షిత 462,  శ్రీ వర్షిని 462, దివ్యశ్రీ 460 మార్కులు సాధించారు. సీఈసీలో ముస్కాన్ 406 మార్కులు సా ధించారని కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా స్కాలర్ కళాశాల యాజమాన్య సభ్యులు డాక్టర్ పి. జగదీ శ్వర్, డాక్టర్ జి. వరప్రసాదరావు, డాక్టర్ బి. నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ ఎల్. సత్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్స్ శ్రీధర్, మధుసూదన్ గుప్తా, అధ్యాపక బృందం ఉత్తమ మార్కులతో రాష్ట్రస్థాయి ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థిని, విద్యార్థులను కళాశాల యజమాన్యం శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందించారు.