22 June, 2026 | 5:54 AM

మరణించిన పోలీస్ సిబ్బంది పిల్లలకు స్కాలర్‌షిప్

15-06-2024 01:06 AM

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): మరణించిన పోలీస్ సిబ్బం ది పిల్లలకు శుక్రవారం అడిషనల్ డీజీపీ, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ తన కార్యాలయంలో స్కాలర్‌షిప్‌లను అందజేశారు. పరివర్తిన్ స్కాలర్‌షిప్‌ల పేరుతో హెచ్ డీఎఫ్‌సీ బ్యాంకు మూడేళ్లుగా మరణించిన పోలీస్ సిబ్బంది పిల్లలకు సహాయాన్ని అందజేస్తోంది. ఈ ఏడాది 58 మంది పిల్లలకు రూ.14. 87 లక్షల చెక్కులను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సిబ్బంది అడిషనల్ డీజీపీకి అందజేశారు. దీంతో ఆయన చెక్కులను విద్యార్థులకు పంపిణీ చేశారు. మూడేళ్లలో మొత్తం 151 మందికి హెచ్‌డీఎఫ్‌సీ అండగా నిలిచింది. పోలీస్ కుటుంబాల్లోని ఎల్‌కేజీ నుం చి పీజీ వరకు చదివే విద్యార్థులకు పరివర్తిన్ స్కాలర్‌షిప్ వర్తిస్తోందని హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది. బ్యాంకు లో ఖాతా ఉండి మరణించిన 11 మంది హోంగార్డులకు 3.75 కోట్లు అందజేసినట్టు పేర్కొన్నది.