బాసరలో భక్తుల రద్దీ
15-06-2024 01:03 AM
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారి దర్శనం కోసం ఉదయం 5 గంటల నుంచే భక్తులు క్యూలైన్‌లో నిరీక్షించారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు పెద్ద ఎత్తున చేయించారు. రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీ నేపథ్యంలో ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈవో విజయ రామారావు పర్యవేక్షించారు.
నిర్మల్, విజయక్రాంతి






