లక్సెట్టిపేటలో ‘సర్’ 90.46 శాతం పూర్తి
- ఏఎస్‌డీ కేటగిరిలో 8059 ఓట్లు
- అనామలీస్ ఓట్లను సరిచేస్తాం
- నియోజకవర్గంలోనే ద్వితీయ స్థానం
- అభ్యంతరాలను స్వీకరిస్తామంటున్న తహసీల్దార్ దిలీప్ కుమార్
లక్సెట్టిపేట, ఆగష్టు 9 : ఎన్నికల కమీషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’సర్’ కార్యక్రమం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీఎల్‌ఓ, బీఎల్‌ఏ లను నిరంతరం సమన్వయం చేసి, రేయింబవళ్ళు పని చేసిన తహసీల్దార్ దిలీప్ కుమార్ ప్రత్యేక శ్రద్ధతో లక్షేట్టిపేట మండలం డిజిటైజెషన్ ప్రక్రియలో నియోజక వర్గంలోనే రెండవ స్థానంలో నిలిచింది. అర్హత ఉన్నటువంటి ఒక్క ఓటు కూడా జా బితా నుంచి తొలగింపునకు గురికాకుండా ఉండాలని ఎన్నికల సంఘం,
ప్రభుత్వ పెద్ద లు పదే పదే చెప్పడంతో క్షేత్ర స్థాయిలో ప్ర జా ప్రతినిధులు, అధికారులు అప్రమత్తమయ్యారు. మంచిర్యాల ఎమ్మెల్యే ఇటీవల ల క్షేట్టిపేట, మంచిర్యాల మార్కెట్ కమిటీల ప్ర మాణ స్వీకార కార్యక్రమాల్లో ప్రత్యేక చొరవ తీసుకుని పలుమార్లు మండలాల ’సర్’ న మోదుపై ఎప్పటికప్పుడు గుర్తు చేయడంతో నియోజకవర్గంలో ఓట్ల డిజిటైజెషన్ వేగవంతంగా జరిగింది.
- 90.46 శాతం పూర్తి....
ఆదివారం మధ్యాహ్నం 2 వరకు మండలంలో 90.46 శాతం ఓట్ల డిజిటైజెషన్ పూర్తి అయినట్లు తహసీల్దార్ వెల్లడించారు. మండలంలో మొత్తం 26, 303 ఓట్లు ఉండగా, వాటిలో 23,794 ఓట్ల డిజిటైజెషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. కాగా వీటిలో 2,509 ఓట్లు ఏ ఎస్ డీ కేటగిరి లో (ఆబ్సెంట్,షిఫ్టేడ్, డెడ్ ) చేర్చబడ్డాయి. ము న్సిపాలిటీ పరంగా 18,507 ఓట్లు ఉండగా, వాటిలో 15,409 ఓట్ల డిజిటైజెషన్ పూర్తి అయ్యింది. మున్సిపాలిటీలో 5,550 ఓట్లు ఏ ఎస్ డీ కేటగిరిలో చేర్చబడ్డాయి.
మున్సిపాలిటీ, మండలంతో కలిపి మొత్తం 8,059 ఓట్లను ఏ ఎస్ డీ కేటగిరిలో అధికారులు చేర్చారు. వీరి పేర్లు ఈ నెల 10 తర్వాత ప్రకటించే ముసాయిదా జాబితాలో ఉండవు. వీరిని ఆబ్సెంట్, షిఫ్టేడ్, డెడ్ విభాగాల్లో చే ర్చారు. కాగా,అనమాలిస్ ఓట్ల గుర్తింపు, వాటి సవరణకు అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
91 శాతం ఓటర్ల వివరాలు సేకరణ...
మండలంలో ఉన్న మొత్తం ఓటర్లలో 10 0 శాతం మంది ఓటర్లను అధికారులు ఇప్ప టి వరకు సంప్రదించారు. ఇందులో 91 శా తం మంది తమ వివరాలను అధికారులకు వెల్లడించారు. ఇంకా సుమారు తొమ్మిది శాతం మంది వివరాలు చెప్పలేదని సమాచారం. నేటితో గడువు ముగియనున్న నేప థ్యంలో ఇంకో తొమ్మిది శాతం మంది ఓటర్లను సంప్రదించే అవకాశం ఉంది. స్థానిక వి శ్రాంత ఉద్యోగుల భవనంలో సిబ్బంది కో సం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు జిల్లా అదనపు పాలనాధికారి చంద్రయ్య, జిల్లా అదనపు పాలనాధికారి (రెవెన్యూ) రాములు పర్యవేక్షించారు. అధికారు లు ఇంతగా శ్రమించినప్పటికీ, ఓటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఎన్యూమరేషన్ పత్రా లు బీఎల్‌ఓ లకు ఇవ్వకపోతే వారి ఓట్లు తొ లగిపోతాయి. నేటితో ఆయా కాలనీల్లో ఇం టింటికి తిరుగుతున్న బీఎల్‌ఓలకు వివరాలు వెల్లడించి, ఎన్యూమరేషన్ పత్రాలు అందజేస్తే ఓటును కోల్పోయే పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు.
ప్రతి ఓటును పకడ్బందీగా డిజిటలైజేషన్ చేస్తున్నాం
మండలంలో దాదాపుగా 100 శాతం ’సర్’ డిజిటైజెషన్ ప్రక్రియ పూర్తయ్యింది. అర్హులైన వారి ఏ ఒక్కరి ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా శ్రద్ధ పెట్టినాము. జాబితాలో చేర్చకుండా ఏమైనా పొరపాట్లు ఉన్న ఓట్లకు (అనామలీస్) మళ్ళీ అవకాశం ఉంటుంది. బీఎల్‌ఓ లు, సిబ్బంది సమన్వయంతో పని చేయడంతోనే ఇది సాధ్యమైంది. జాబితాలో ఏమైనా వివాదాస్పద, అభ్యంతరాలు ఉంటే ఓటర్ల నమోదుకై ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
తహసీల్దార్ దిలీప్ కుమార్






