16 March, 2026 | 1:59 PM

స్కాలర్‌షిప్స్ ప్రభుత్వ బిక్ష కాదు

16-03-2026 12:00 AM

కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థుల రాత్రి బస, ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన 

కామారెడ్డి, మార్చి 15 (విజయక్రాంతి): విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం ప్రభుత్వ బిక్ష కాదని, విద్యార్థుల హక్కు అని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్లే ఎదుట రాత్రి బస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం రాత్రి కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో బస కార్యక్రమాన్ని నిర్వహించారు.

రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి తొమ్మిది వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్య  ధోరణిని విడనాడాలని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఏబీవీపీ ప్రతినిధులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామరెడ్డి జిల్లా  ఆధ్వర్యంలో స్కాలర్ షిప్స్  ప్రభుత్వం పెట్టే బిక్ష కాదు విద్యార్థులు హక్కు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి 9000 ఫీజు రియంబర్స్మెంట్ను స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థుల రాత్రి బస