16 July, 2026 | 12:22 AM

జిట్స్‌లో విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ

16-07-2026 12:00 AM

తిమ్మాపూర్, జూలై 15 (విజయక్రాంతి): జ్యోతిష్మతి కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ.18 వేల స్కాలర్షిప్ అందజేస్తామనే హామీని సంస్థ యాజమాన్యం అమలు చేసింది.

ఈ సందర్భంగా మానకొండూర్ మండలం లలితాపూర్ గ్రామానికి చెందిన నల్లెంగి మేఘన, కరీంనగర్‌కు చెందిన సఫూరా షర్మిన్, వేములవాడకు చెందిన జింక తరుణ్, రాజన్న సిరిసిల్ల బోయిన్‌పల్లి మండలానికి చెందిన అదురు గట్ల శ్రీజ, రామగుండంకు చెందిన యాదండ్ల స్పందన, కరీంనగర్‌కు చెందిన ఆసియా సీఎస్‌ఈ విభాగంలో, కరీంనగర్‌కు చెందిన మైత్రి ఈసీఈ విభాగంలో, జగిత్యాలకు చెందిన కట్ట గౌతమ్ కుమార్, కరీంనగర్‌కు చెందిన గుమ్మడి అక్షర, సహ్రీష్ ఫర్జిన్ సిఎస్‌ఎం విభాగంలో చేరగా ఒక్కొక్కరు రూ.18 వేల విలువైన స్కాలర్షిప్ చెక్కులను అందుకున్నారు. చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు కళాశాలలో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి ప్రతి సంవత్సరం రూ.18 వేల చొప్పున నాలుగు సంవత్సరాలకు మొత్తం రూ.72 వేల స్కాలర్‌షిప్ అందజేయనున్నట్లు తెలిపారు.