ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరికలు
మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్
బడంగ్‌పేట్, జులై 15 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనను చూసి, ప్రజలు, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్ పేర్కొన్నారు. బుధవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ సర్కిల్ బాలాపూర్ డివిజన్ నుంచి బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన దాదాపు 150 మంది కాంటెస్ట్ ఎమ్మెల్యే, టిపిసిసి కార్యదర్శి ఎలిమేటి అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేఎల్‌ఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తుక్కుగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దొడ్డి శ్రీకాంత్, చింతకింది భాను, బోదాస్ రాఘవేంద్ర తదితరులకు కెఎల్‌ఆర్ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేఎల్‌ఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూసి ఇతర పార్టీలకు చెందిన ప్రతినిధులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చెప్పారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపుతో పాటు సముచిత స్థానం ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.
పార్టీ నమ్మి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమములో రంగారెడ్డి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ క్యారగారి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ బాలు నాయక్, గజ్జల రామచందర్, జల్ పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హమ్మద్ బామ్, గుండోజి వెంకట్ చారి, ఎర్ర సుదర్శన్, రావుల లింగం, వంగేటి మధుసూదన్ రెడ్డి, కొండ శ్రీధర్ రెడ్డి, వరికుప్పల సురేష్ (టిల్లు), మేకల కిరణ్, మేకల మహేందర్, ఎన్ను శ్రీనివాస్ రెడ్డి, గుండ్ల కొమురయ్య, గుండ్ల శ్రీశైలం, మైత్రి ఆనంద్, మదారి భాస్కర్, గిరి నాయక్, ప్రేమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






