15 నుంచి మోగనున్న బడిగంట
08-06-2026 12:00 AM
- 13 రెండో శనివారం, 14 ఆదివారం నేపథ్యంలో పున: ప్రారంభ తేదీ మార్పు
- జూలై 11 రెండో శనివారం తరగతుల నిర్వహణ
- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రకటన
హైదరాబాద్, జూన్ 07 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈ నెల 12కు బదులు 15న పునఃప్రారంభించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 13న రెండో శనివారం, 14న ఆదివారం కావడంతో ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సెలవులు పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కాగా 12న సెలవు ఇచ్చినందున విద్యాసంవత్సరం నష్టపోకుండా జూలై 11న రెండో శనివారం తరగతులు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.






