calender_icon.png 8 August, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కూల్ లైఫ్ మొదలు

22-07-2024 02:30:21 AM

నైనీషా క్రియేషన్స్, క్రౌడ్ ఫండింగ్‌లో నైనీషా, రాహుల్ త్రిశూల్ నిర్మిస్తున్న సినిమా స్కూల్ లైఫ్. పులివెందుల మహేష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి సావిత్రి కృష్ణ హీరోయిన్. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా హీరో కిరణ్ అబ్బవరం, దర్శకుడు వి.సముద్ర విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్మాత రాహుల్ త్రిశూల్  మాట్లాడుతూ “నిర్మాతగా ఇది నాకు మూడవ సినిమా. నేను గతంలో చేసిన ‘రాయలసీమ ప్రేమ కథ’ సినిమా సమయంలో పరిచయమైన మహేష్ ఈ సినిమా గురించి చెప్పడంతో కథ నచ్చి భాగమయ్యాను. సినిమా చిత్రీకరణ ఆగస్టు 2న ఆరంభించి సెప్టెంబర్ 2కి ఒకే షెడ్యూల్లో పూర్తి చేయనున్నాం” అని తెలిపారు. ఆమని కీలక పాత్రలో నటించనున్న ఈ సినిమాకి డిఓపి: ధర్మ ప్రభ, సంగీతం : హర్ష ప్రవీణ్, ఎడిటర్ : నందమూరి హరిబాబు.