విద్యుత్ వినియోగంలో రికార్డు!
- ఈ నెల 13న ఒకేరోజు 341.08 మిలియన్ యూనిట్ల వినియోగం
- డిప్యూటీ సీఎం భట్టి అభినందనలు
హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): విద్యుత్ చరిత్రలో మరో రికార్డు న మోదయ్యింది. తెలంగాణలో ఒక్కరోజే అత్యధికంగా విద్యుత్ వినియోగం రికార్డయ్యింది. శుక్రవారం 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించాం. ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా విద్యుత్ వినియోగం జరిగినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా విద్యుత్‌ను సరఫరా చేసినందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ రంగ ఉద్యోగులు, కార్మికులకు అభినందనలు తెలిపారు.
శుక్రవారం ఉదయం 11.17 గంటలకు 18,229 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదవ్వగా.. పూర్తిస్థాయిలో విద్యుత్‌ను సరఫరాచేశారు. శుక్రవారం మొత్తం 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. దీంతో గత రికార్డు అయిన 335.19 మిలియన్ యూనిట్ల వినియోగం (18.3.2025) అనేది మరుగు నపడింది. ఉష్ణోగ్రతలు పెరగడం, వ్యవసాయ అవసరాలు పెరగడంతో ఈ గరిష్ఠ విద్యుత్ వినియోగం నమోదయ్యింది.
రాబో యే రోజుల్లో విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉందని, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సరఫరా చేసేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలను తమ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నాయి. రోజుకు 350 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంటుందని, అలాగే గరిష్ఠ డిమాండ్ 19 వేల మెగావాట్లకు చేరుకుంటుందని అం చనా వేసి.. అందుకు సంసిద్ధంగా ఉన్నాయి. అత్యధిక డిమాండ్, వినియోగం నమోదవుతున్న సమయంలో నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్నందుకు అన్ని విద్యుత్ సంస్థ ల సిబ్బందికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలియజేశారు.




