28 February, 2026 | 11:35 AM

కోనరావుపేట పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు

28-02-2026 10:05 AM

కోనరావుపేట,(విజయక్రాంతి): పీఎం శ్రీ ఎంపీపీఎస్ కోనరావుపేట పాఠశాలలో సైన్స్ డే(Science Day celebrations) కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజ్మీరా మదన్ లాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆడెపు రాజేశం ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యార్థులు శాస్త్రీయ అవగాహనను ప్రతిబింబించే విధంగా అనేక రకాల సైన్స్ ఎగ్జిబిట్లను తయారు చేసి ప్రదర్శించారు.పిల్లల సృజనాత్మకత, ఆలోచనా శక్తిని అభినందిస్తూ ఉపాధ్యాయులు వారికి మార్గనిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయ్, భాస్కర్, రాము, వెంకటేష్, సంజీవ్, శృతి, అనూష లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సైన్స్ డే వేడుకలు విద్యార్థుల్లో శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించాయని నిర్వాహకులు తెలిపారు.