హరిపురం గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల అవగాహన
02-05-2026 02:09 AM
ముత్తారం, మే 1 (విజయక్రాంతి): మండలంలోని హరిపురం గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. జగిత్యాల పొలాస వ్యవసాయ పరిశోధనా శాస్త్రవేత్తలు అర్చన రాకేష్ పాల్గొని మెక్కజోన్న, అయిల్ ఫామ్, వరి, పసుపు, కూరగాయల పంట మార్పిడి ప్రయోజనాలను వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్, అతి వినియోగం వల్ల కలిగే నష్టాలు వ్యవసాయం లో పాటించే పద్దతులు మెలుకువలు లాభసాటి వ్యవసాయం ఎలా చేయాలి వంటివి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మెంగని సమత తిరుపతి, ఏఈవో హరిక, హెచ్ ఇఓ రాకేష్, వార్డు సభ్యులు ఏజ్జ లత తిరుపతి, రామంచే స్వరూప రాజేష్, అడ్డూరి మోహన్, రైతులు నాయకులు పాల్గొన్నారు.






