calender_icon.png 29 May, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంటల సాగు విధానంపై శాస్త్ర వేత్తల అవగాహన

09-05-2025 12:15:39 AM

కడ్తాల్, మే 8 :  పంటల సాగు విధానంపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు డా, వి. అనిత, ప్రొపెసర్, డా. టి. సుప్రజ్ఞ,  డా. విద్యాసాగర్, డా. శిరీష దీప్తి, ఎ. సాహితిలు రైతులకు అవగాహన కల్పించారు.

గురువారం కడ్తాల  మండలం రావిచెడ్, టాకురాజుగూడ గ్రామాల్లో  రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్ర వేత్తలు వ్యవసాయంలో సాగు విధానాలు  బిందు సేద్యం, సుస్థిర వ్యవసాయ పద్దతులు చేపట్టడం ద్వారా  పంటలు  పరిరక్షించుకోవడం సాధ్యం అవుతుందని పంటల సాగు పద్ధతుల గురించి వివరించారు.

పలురు రైతులు అవగాహన సదస్సుకు తరలు వచ్చి సాగులో తమ సందేహాలను శాస్త్రవేత్తలున్నడిగి నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో ఏఓ శ్రీలత, రైతులు విఠలయ్య గౌడ్,  శ్రీనివాస్, గోపాల్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.