09-05-2025 12:13:23 AM
-సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ
-రావి నారాయణరెడ్డి గుడిసె బాధితులను పరామర్శ
అబ్దుల్లాపూర్‌మెట్, మే 8: పేదలకు ఇంటి స్థలాలు దక్కేవరకు పోరాడుతామని సిపిఐ జాతీ య కార్యదర్శి కే నారాయణ అన్నారు. రంగారెడ్డి జిల్లా, పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధి రావి నారాయణరెడ్డి కాలనీని సందర్శించు.. గుడిసె బాధితులను గురువారం సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలసి పరామర్శించారు.
నారాయణ వినతి మేరకు విజయవాడ పాపులర్ షూ మార్ట్ యాజమాన్యం నిరాశ్రయ పేదలకు కనీస అవసరాల కోసం దుప్పట్లు టవల్స్, ప్లాస్టిక్ బకెట్లు అందజేశారు. సంఘటన స్థలాన్ని సందర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ మాట్లాడుతూ... పేదలకు ఇంటి స్థలాలు దక్కేవరకు పోరాడుతామన్నారు.
ప్రమాదం జరిగి 15 రోజులు కావస్తున్న స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం బాధితులను పరామర్శించక పోవడం చాలా దారుణం అన్నారు. ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం కింద ఒక లక్ష రూపాయలు అయినా ఇవ్వాలన్నారు. అందాల పోటీలో నిమగ్నమైన రేవంత్ సర్కార్ ఒక్కసారైనా నష్టపోయిన పేదల వైపు చూడాలని డిమాండ్ చేశారు.
అందాల భామలు ఓట్లు వేయరని... పేరు పేద లేనని గుర్తు చేశారు. గుడిసెలను కాల్చిన ఆగం తకులపై చర్యలు తీసుకోవాలన్నారు. భూస్వాములు కబ్జాదాలు ఎన్ని కుట్రలు చేసినా.. సిపిఐ పార్టీ పేదల పక్షాన పోరాడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజ్ రవీంద్ర చారి, సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ముత్యాల యాదిరెడ్డి, పానుగంటి పర్వతాలు, పల్లె నర్సింహా, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బతి లక్ష్మణ్,ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు అజ్మీర్ హరిసింగ్ నాయక్, మండలపార్టీ నాయకులు కేతరాజు నర్సింహా పొన్నాల యాదగిరి, వట్టి నవనీత, ఆవుల యాదగిరి,మధు వినోద్ నాయక్, దేవమ్మ, వీరేష్, అంజి తదితరులు పాల్గొన్నారు.