09-05-2025 12:17:24 AM
ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వద్యాలయం శాస్త్రవేత్తలు
చేవెళ్ల , మే 8 : రైతులు పంటల్లో యూరియా వాడకాన్ని తగ్గిస్తేనే నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మండల వ్యవ సాయ శాఖ సమన్వయంతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు (రైతులకు అవగాహన) కార్యక్రమాన్ని గురువారం చెవెళ్ల మండల పరిధి కుమ్మెర, గొళ్లపల్లి, శంకర్పల్లి మండల పరిధి ఎర్వగూడ గ్రామాల్లో నిర్వహించారు.
కుమ్మెరలో వ్యవసాయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, డా.వి.రమ్య, గొల్లపల్లిలో సీనియర్ శాస్రవేత్త డా.ఎం.ప్రమీల, ఎర్వగూడలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, శాస్త్ర వేత్త డాక్టర్ లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంటల్లో యూరియా వాడకం తగ్గించడం వల్ల నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, పంట మార్పిడి చేయడంతో చీడపీడలను తగ్గించవచ్చని సూచించారు. మొక్కలను పెంచడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.
రసాయనాలను అవసరాన్ని బట్టి వాడటంతో పాటు పుట్టగొడుగుల పెంపకం, గులాబీ సాగులో చీడ,పీడల నివారణ గురించి వివరించారు. ఈ కార్యక్రమాల్లో చేవెళ్ల ఏడీఏ సురేశ్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా.వి. కవితా కిరణ్, సిహెచ్. స్నేహలత, చేవెళ్ల ఏవో శంకర్ లాల్, ఏఈఓలు బాలకోటేశ్వర్, ప్రతిభ, మనీష, మల్లేశ్, రైతులు, విద్యార్థులు, కె.రాజేష్, ఎం.అపూర్వ, ఎస్.కౌసల్య, కె.గిరిబాబు పాల్గొన్నారు.