31 July, 2026 | 1:59 PM

పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

03-09-2025 12:41 AM

బూర్గంపాడు,సెప్టెంబర్ 2,(విజయక్రాంతి): కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం మండలంలో పర్యటించింది. మం గళవారం మండలంలోని నాగినేనిప్రోలు రె డ్డిపాలెం,మొరంపల్లి బంజర,సంజీవరెడ్డిపా లెం గ్రామాల్లోని వరి,పత్తి పంటలను పరిశీలించారు. పత్తి పంటలో నీరు నిల్వకుండా చూసుకోవాలని సూచించారు. అధిక తేమ తో వేరుకుళ్లు, మెగ్నీషియం ధాతు లోపం వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

పోషక లోపాల నివారణకు జింక్ సల్ఫేట్ 2 గ్రా ములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చే యాలని, పొటాష్ లోపం ఎకరానికి 25 కిలోల పొటాష్ ను వెదజల్లాలని, లీటరు నీటికి 5 గ్రా. 19:19:19 మిశ్రమం లేదా 2 మి.లీ. నానో యూరియా/నానో డీఏపీ పిచికారీ చేసుకోవాలని చెప్పారు.రైతులు ఎప్ప టికప్పుడు వ్యవసాయ విస్తరణ అధికారులు లేదా వ్యవసాయ అధికారులను సంప్రదిం చి,వారి సూచనల మేరకు మాత్రమే పురుగు మందులను వాడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు శివ,హరిచంద్ర,సహాయ వ్యవసాయ సంచాలకులు బి.తాతారావు,ఏ ఈఓ లు శృతి ,నాగ వైష్ణవి ,పవన్, రైతులు గాదె నర్సిరెడ్డి, కైపు సుబ్బిరామిరెడ్డి,బత్తుల రాంకొండారెడ్డి, బిజ్జం వెంకటరామిరెడ్డి , మారం శ్రీనివాసరెడ్డి, భజన పెద్ద నాగం, మేకల వెంకన్న, కంది జయరామిరెడ్డి, నిమ్మల రాములు, పాల్గొన్నారు.