31 July, 2026 | 3:07 PM

హమ్మయ్య.. యూరియా వచ్చింది

03-09-2025 12:40 AM
  1. రాష్ట్రానికి చేరిన 14 వేల టన్నుల యూరియా 
  2. మరో వారం రోజుల్లో 27,470 టన్నులు 
  3. యూరియా సరఫరాలో రైతులకు ఇబ్బంది కలగొద్దు 
  4. అయిదు రోజుల్లో పంట నష్టం సర్వే పూర్తి చేయాలి  
  5. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు 

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎరువుల సరఫరా విషయంలో రాష్ర్ట ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచడానికి, కేంద్రంతో ఎప్పటి కప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

రాష్ట్రానికి ఇప్పటివరకు 14 వేల (సోమవారం 9 వేలు, మంగళవారం 5 వేలు) టన్నుల యూరియా వచ్చిందని, మరో వారం రోజుల్లో 27,470 టన్నుల యూరియా రానుందని తెలిపారు. మంగళవారం సచివాలయంలో సంబంధిత అధికా రులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు.  యూరియా రైల్వే రేక్ పాయింట్లయి న సనత్‌నగర్, వరంగల్, జడ్చర్ల, నాగిరెడ్డిపల్లి, మిర్యాలగూడ, కరీంనగర్, నిజామా బాద్ ప్రాంతాలకు చేరుకుంటుందన్నారు.

ఈ ఎరువులను రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డిమాండ్‌కు అనుగుణం గా పంపిణీ చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పేర్కొ న్నారు. రైతులకు ఎరువుల కొరత ఉండకుం డా, అవసరమైన చోట తక్షణమే అందేలా సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఇటీవల వర్షాల కార ణంగా జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.

రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా, సకాలంలో సహా యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చె ప్పారు. అందుకోసం పంట నష్టం సర్వేను వేగవంతంగా పూర్తిచేయాలని, అయిదు రోజుల్లోపు పంటనష్టంపై నివేదికను పూర్తి చేయాలని సూచించారు. రైతుల సంక్షేమం, పంటల రక్షణ రాష్ర్ట ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమన్నారు.