4 March, 2026 | 4:08 AM

సిద్దిపేట మోడల్ రైతు బజార్‌లో స్క్రీన్‌ల ఏర్పాటు

04-03-2026 12:25 AM

గత కొన్ని నెలలు గా పని చేయని స్క్రీన్ లు.. 

సిద్దిపేట మార్చి 3 (విజయక్రాంతి):సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మోడల్ రైతు బజార్ లో ఎట్టకేలకు ఎల్‌ఈడీ స్క్రీన్ లు ఏ ర్పాటు చేశారు. గత కొన్ని నెలలుగా ఎల్‌ఈడీ స్క్రీన్ లు లేకపోవడంతో ప్రజలు ధర ణి తెలుసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల హరీష్ రావు రైతు బజా ర్ సందర్శించినప్పుడు విషయం ఆయన దృష్టికి వచ్చింది దాంతో అక్కడున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కూరగా యలు విక్రయించే రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  మాజీ మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు ఎట్టకేలకు ఎల్‌ఈడీ స్క్రీన్ లు మంగళవారం ఏర్పాటు చేశారు. గత కొన్ని నెలలుగా పని చేయని స్క్రీన్ లను పరిశీలించిన హరీష్ రావు అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేయడం వల్లే  ఆయన ఆదేశాల తో వారం లోపే స్క్రీన్ లు ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా రైతులు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు.