ఆకతాయిలు నిప్పంటించగా కంపెనీలోని ఆటోలు దగ్ధం
04-03-2026 12:24 AM
మనోహరాబాద్, మార్చి 3.మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులో గల ఎం.ఎల్.ఆర్ ఆటో కంపెనీ పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని ఆకతాయిలు నిప్పు అంటించారు. ఎండాకాలం సీజన్ లోఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో నిప్పు పూర్తిగా వ్యాపించి కంపెనీలోని ఆటోలు అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయాయి. పరిధిలోని కొందరు సమీపస్తులు అగ్రి మాపక కేంద్రానికి సమాచారం అందించగా ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకొని వాటర్ తో మంటలు ఆర్పగా మంటలు నియంత్రణ లోకి వచ్చాయి.




