13 July, 2026 | 9:48 PM

Breaking News

నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •  

కేంద్ర మంత్రి చిరాగ్ అనుచరుడి ఇళ్లల్లో సోదాలు

28-12-2024 01:40 AM

మనీ లాండరింగ్  కేసులో ఈడీ దర్యాప్తు

పాట్నా, డిసెంబర్ 27: కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమలశాఖ మంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు (రామ్‌విలాస్) చిరాగ్ పాశ్వాన్ అనుచరుడు హులాస్ పాండే అక్రమాస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది. శుక్రవారం ఏకకాలంలో ఈడీ బృందాలు పాట్నా, ఢిల్లీ, బెంగళూరులోని ఆయన నివాసాలను సోదా చేశాయి. బిహార్‌లో ఇసుక మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసును ఈడీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నది.

దందాతో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న నేతల ఇళ్లలో ముమ్మర సోదాలు చేపడుతున్నాయి. దీనిలో భాగంగానే తాజాగా హులాస్ పాండేకు సంబంధించిన ఆస్తులపై నిఘా పెట్టాయి. 2012లో సంచలనం సృష్టించిన ప్రవేటు మిలీషియా రణవీర్ సేన వ్యవస్థాపకుడు బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియా హత్యకేసులో ప్రధాన సూత్రధారిగా సీబీఐ హులాస్ పాండేను ఛార్జిషేట్‌లో పేర్కొన్నది.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ 2023 లో పార్టీ పార్లమెంటరీ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. సీబీఐ ఛార్జిషీట్‌ను ఏప్రిల్‌లో న్యాయస్థానం కొట్టివేయడంతో పాండేకు ఆ కేసు నుంచి విముక్తి లభించింది. పాండే గతంలో జనతాదళ్ (యూనైటెడ్) పార్టీలోనూ కీలకంగా పనిచేశారు.