రిమ్మా గ్రామాన్ని సందర్శించనున్న రెండవ మంత్రి
* 1992లో మంత్రి కొట్నాక్ భీమ్ రావు... 34 ఏళ్లకు మంత్రి జూపల్లి కృష్ణారావు
ఉట్నూర్,(విజయ క్రాంతి) అదో మారుమూల గిరిజన గ్రామం.. ఆ గ్రామానికి అధికారులు వెళ్లాలంటేనే ఆరోజుల్లో భయం భయంగా వెళ్లేవారు. అప్పటి ఐటీడీఏ పీవో రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రత్యేక శ్రద్ధతో రిమ్మ, లచ్చంపూర్ (బి) గ్రామాల్లో గిరిజన రైతులకు వ్యవసాయ బావులు మంజూరు చేశారు. వ్యవసాయ బావులను పరిశీలించుటకు అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కొట్నాక్ భీమ్ రావు ఈ రెండు గ్రామాలను సందర్శించి గిరిజనుల సమస్యలను తెలుసుకున్నారు.
మారుమూల గిరిజన గ్రామాలకు ప్రభుత్వపరంగా కొన్ని నిధులు మంజూరు చేయించి మట్టిరోళ్ల సౌకర్యం కల్పించారు. అదేవిధంగా తాగునీటి కోసం బోరు బావులను మంజూరు చేశారు. మంత్రి భీమ్రావు పర్యటన తర్వాత మంత్రి హోదాలో ఇతర మంత్రులు పర్యటించలేదు. ఈ రెండు గ్రామాలకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎంపీలు పర్యటించిన మంత్రి హోదాలో నాయకులు పర్యటించలేదని రెండు గ్రామాల ప్రజలు అంటున్నారు.
34 ఏళ్ల తర్వాత ప్రస్తుత జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి వస్తున్నారని తెలిసి తమ మారుమూల గ్రామానికి రెండవ మంత్రిగా వస్తున్నారని గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండవ మంత్రిగా మారుమూల గిరిజన గ్రామానికి వస్తున్న మంత్రికి ఆదివాసి గిరిజనుల సాంప్రదాయంగా స్వాగతం పలుకుందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారని రాయి సెంటర్ల జిల్లా మేడి తుడుస్సం అమృత రావు తెలిపారు.
ఈ సందర్భంగా రాయి సెంటర్ల జిల్లా మేడి తోడుసం అమృత్ రావ్ మాట్లాడుతూ.. తమ గ్రామానికి మంత్రి రావడం హర్షనీయమని , సిరికొండ మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలకు అవసరమైన అభివృద్ధి పొలాలను మంజూరు చేస్తారని ఆయా గ్రామాల ప్రజలు ఆశలతో ఉన్నారని అన్నారు. ముఖ్యంగా తమ గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరైన అడవి శాఖ అధికారుల అడ్డంకులతో గత కొన్నేళ్లుగా పనులు ప్రారంభం కావడం లేదని , మంత్రి పర్యటనతో బీటీ రోడ్ల పనులు ప్రారంభం అవుతాయని కొండంత ఆశలతో గిరిజనులు ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు.






