డ్రగ్స్ వద్దు- జీవితం ముద్దు
12-06-2026 04:17 PM
డ్రగ్స్ తో జీవితం మసి - వాటిని మానేస్తే ఖుషీ
నేరేడుచర్ల మండల ఎస్.ఐ ఏ.సైదిరెడ్డి
నేరేడుచర్ల,(విజయక్రాంతి): ప్రజాపాలన_ప్రగతిప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా, నేరేడుచర్ల మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమం నిర్వహించిన సందర్బంగా మండల ఎస్ఐ మాట్లాడుతూ... సమాజంలో డ్రగ్స్, గంజాయిని నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని, గంజాయి వియోగం వల్ల మన పిల్లలు, యువత అనారోగ్యాలకు గురై బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో అందరూ భాగస్వామ్యమై పోలీసు వారికి సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం స్థానిక ప్రజలతో డ్రగ్స్ నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు.






