4 June, 2026 | 1:37 AM

కాలేజీలో రహస్య గదులు

04-06-2026 12:00 AM
  1. చెదలు పట్టిన డబ్బు, రివాల్వర్
  2. కోల్‌కతా సురేంద్రనాథ్ కాలేజీ శుభత్ర డ్రైవ్‌లో కలకలం

కోల్‌కతా, జూన్ 3: కోల్‌కతాలోని ప్రతిష్ఠాత్మక కాలేజీ సురేంద్రనాథ్ కళాశాలలో శుభ్రత డ్రైవ్ చేపడుతుండగా విద్యార్థి యూ నియన్‌కు చెందిన రహాస్య గదుల్లో చెదలు పట్టిన లక్షలాది రూపాయల డబ్బు, మద్యం సీసాలు, ఫర్నిచర్, ఏసీ బెడ్ రూమ్స్‌లు, కండోమ్ ప్యాకెట్లు, ఒకరివాల్వర్ లభించడం కలకలం రేపింది. 2025 నుంచి తాళం వేసి ఉన్న ఈ గదులను ఏడాది తరువాత తెరిచారు. పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. టీఎంసీ నేత దేబాశిష్ బందోపాధ్యాయ్, ఆయన కుమారుడు ఈ గదులను ఉపయోగించారని తెలిసింది.