4 June, 2026 | 1:37 AM

తిరుపతి కల్తీ నెయ్యి కేసులో ఈడీ దూకుడు

04-06-2026 12:00 AM
  1. దేశవ్యాప్తంగా 15చోట్ల దాడులు
  2. 60 లక్షల నగదు, 45 కోట్ల ఆస్తుల దస్తావేజులు స్వాధీనం

న్యూఢిల్లీ, జూన్ 3: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన కల్తీ నెయ్యి కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు (ఈడీ) బుధవారం దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదా లు నిర్వహించింది. ఢిల్లీ, ముంబై, రాజ్‌కోట్, గుంటూరు, రూర్కీ, బికనీర్, అహల్యానగర్, దిండిగల్, డెహ్రాడూన్ ప్రాంతాల్లో పలువురి నివాసాలు, కార్యాలయాల్లో ఈ సోదాలు నిర్వహించారు.

సోదాల సమయంలో రూ. 60 లక్షల నగదు స్వాధీనం చేసుకోగా, రూ. 45 కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్థుల పెట్టుబడులను గుర్తించారు. కల్తీ నెయ్యి సరఫరా ద్వారా సంపాదించిన నేరపూరిత సొ మ్మును వారి కుటుంబ సభ్యుల పేర్లపై రూ. 45 కోట్లకు పైగా విలువైన స్థిరాస్తులలో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించి వాటికి సంబంధించిన దస్తావేజులను స్వాధీ నం చేసుకున్నారు. పొమిల్ జైన్, విపిన్ జైన్, రాజు రాజశేఖరన్, రాజేష్ మన్సుఖ్‌లాల్, అపూర్వ వినయకాంత్, శాంతారామ్, అజ య్ కుమార్, మహేష్ కుమార్, ఆశిష్ అగర్వాల్ ఉన్నారు.

సోదాల సమయంలో 60 లక్షల నగదు, రూ.45 కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్తుల్లో పెట్టుబడులు గుర్తించారు. 2019 నుంచి 2024 మధ్య రసాయనాలతో శుద్ధి చేసిన రూ. 250 కోట్ల నెయ్యి ఆలయానికి సరఫరా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో యజమానులు, మధ్యవర్తులు, టీటీడీ సిబ్బంది సహా 36 మందిపై ఎస్‌ఐటీ గతంలో ఛార్జీషీట్ దాఖలు చేసింది.