22 March, 2026 | 10:38 AM

సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు సీఎంను ఆహ్వానించిన ఆలయ అర్చకులు

19-07-2024 05:18 PM

హైదరాబాద్: సచివాలయంలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మహంకాళి ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని ఆలయ అర్చకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఎంపీ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.