15 April, 2026 | 1:01 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పటిష్టంగా ఉండాలి

27-11-2025 07:58 PM

జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

గద్వాల: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గల గోదాములో ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను జిల్లా కలెక్టర్ సంతోష్ గురువారం సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనఖిలో భాగంగా కలెక్టర్ ఈ తనిఖీ నిర్వహించారు.

గద్వాల జిల్లాకు సంబంధించిన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తో పాటు భద్రత నిర్వహణను పరిశీలించారు.ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ నిర్వహణకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు.స్ట్రాంగ్ రూమ్ భద్రతలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గద్వాల తహసిల్దార్ మల్లికార్జున్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ కరుణాకర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.