తార్నాకలో విదేశీ డ్రగ్స్ స్వాధీనం
ముగ్గురి అరెస్ట్ కేసు నమోదు
హైదరాబాద్ సిటీబ్యూరో మే 31(విజయక్రాంతి) : తార్నాకలోని లాలాపేట్‌లో గుట్టు చప్పుడు కాకుండా కుష్ అనే విదేశీ డ్రగ్స్‌ను అమ్ముతున్న ముగ్గురు నిందితులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. పలువురు వ్యక్తులు విదేశీ డ్రగ్స్ అమ్ముతున్నట్లు వచ్చిన పక్కా సమాచారం మేరకు ఎస్టీపీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్‌రావు, ఎస్సై బాలరాజు తమ సిబ్బందితో దా డులు నిర్వహించారు. లాలాపేటలో విద్యార్థులకు డ్రగ్స్ అమ్ముతుండగా మహమ్మద్ ఖాన్(అమాన్), మహమ్మద్ మొబిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు నిఖిల్ అనే మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వ ద్ద నుంచి 33 గ్రాముల కుష్ లభించింది. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ తెలిపారు. గంజా యి కంటే కుష్ డ్రగ్స్ 26శాతం అధికంగా మత్తునిస్తుందని చెప్పారు. విదేశాల నుంచి సముద్రమార్గం ద్వారా బెంగుళూరుకు అక్రమమార్గంలో వస్తుందని, అక్కడి నుంచి హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులు తెచ్చుకుంటారన్నారు. స్వాదీనం చేసుకున్న డ్రగ్స్ విలు వ రూ. 1. 32లక్షలు ఉంటుందని చెప్పారు.






