calender_icon.png 23 July, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక

22-07-2025 06:03:28 PM

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి జిల్లా బాక్సింగ్ సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ సెలక్షన్స్ ను ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియం కరీంనగర్ లో ఎంపిక చేశారు. ఇందులో ప్రతిభ చూపిన క్రీడాకారులు, ఏం శ్రీ సాయి దత్తు, శశివదన్, మహేష్, టి రాహుల్, ఆర్ అఖిల్, కే రితేష్ కాకతీయ జోషిత్, భరద్వాజ్, దుర్గరాజు, అఫ్రిది సైనిక్ స్కూల్ షేక్ సయ్యద్ జమీల్ అహ్మద్, ఆది అర్ఫాన్ లక్ష్య ఇంటర్నేషనల్, బాలిక విభాగంలో జి హరిని శ్రీ మోడల్ హై స్కూల్ ఎలగందల్ మడిపల్లి నక్షత్ర పారిమిత హై స్కూల్ కరీంనగర్, పెద్దపల్లి నుంచి కే సూర్య ప్రతాప్ సిహెచ్ జస్వంత్ ట్రినిటీ అద్విత్ శివ ఓ సాయి విక్రమ్ ఏం కృష్ణ రేవంత్ ఏం అజయ్ కుమార్ సిహెచ్ అశ్విత్ రుక్షిత్ టి సాహిల్ తీగల రాజ్ విభాగంలో కే అక్షర డి రిషి చరణ పి వర్షిత జడ్.పి.హెచ్.ఎస్ కనపర్తి బాక్సర్లు ఎంపిక అయ్యారు.

జులై 25 26 27 షేక్పేట్ హైదరాబాద్ లో రాష్ట్రస్థాయి బాక్సింగ్ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలలో వీరు పాల్గొంటారు. వీరిని కరీంనగర్ డివైస్ ఓ శ్రీనివాస్ గౌడ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి సత్యనారాయణ కొత్తకొండ సంపత్ కుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తాసిల్దారు మడిపల్లి కాలి చరణ్, సీనియర్ బాక్సింగ్ క్రీడాకారులు ఎంపీ ఓ ఎం ప్రవీణ్ బాక్సింగ్ జిల్లా పరిధిలో జి మురళి, రంజిత్, రాజేందర్ కోచ్ రామకృష్ణ అభినందించారు.