22-07-2025 06:10:50 PM
కుభీర్ (విజయక్రాంతి): వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్సీసీ విద్యార్థులకు మంగళవారం మండల కేంద్రం కుబీర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రశంస పత్రాలను అందజేయడం జరిగింది. కుబీర్ తో పాటు పార్డి(బీ) తదితర గ్రామాలలో వైద్య శిబిరాలు, వివిధ పండుగలు, సప్తమి వేడుకలు సందర్భంగా ఎన్సీసీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన సేవలను పలు ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సట్ల గంగాధర్, దత్తాత్రి, గంగారామ్, పార్థసారథి,రాజేశ్వర్, శ్యామ్, తదితర ఉపాధ్యాయ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.