calender_icon.png 9 January, 2026 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అండర్-10 లాంగ్ జంప్ లో రాష్ట్రస్థాయికి ఎంపిక

08-01-2026 05:18:23 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని చాకలి ఈశా అండర్ టెన్ లాంగ్ జంప్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. ఈ మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిపిన అథ్లెటిక్స్ కాంపిటీషన్ మీట్లో ఖానాపూర్ కు చెందిన చాకలి ఈశా ప్రతిభ కనబరిచింది. అండర్ -10 విభాగం లాంగ్ జంప్ లో జిల్లాలో మొదటి స్థానం సాధించింది. జిల్లా నుండి రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎంపికవడం పట్ల స్థానికులు, క్రీడాకారులు, హర్షం వ్యక్తం చేశారు.