08-01-2026 05:14:48 PM
మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండలం రామ్ రెడ్డి పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ లఫంగినర్సింహా ఆధ్వర్యంలో మాల్ పట్టణ పీపుల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో గురువారము వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ క్యాంపులో మహిళలకు, గర్భిణీలకు, పెద్దలకు, పిల్లలకు సంబంధిత ప్రాథమిక వైద్య సేవలను డాక్టర్లు అందజేశారు. అత్యవసర పరీక్షల నిమిత్తం హాస్పిటల్కు రోగులు హాజరయ్యి చికిత్స పొందాలని తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచి లపంగి నరసింహ మాట్లాడుతూ, గ్రామంలో లోని ప్రతి ఒక్కరు ఈ శిబిరాన్ని సద్వినియోగంపరచుకొని, అందరూ ఆరోగ్య వంతులుగా ఉండాలనీ, అదేవిధంగా అత్యవసర సేవలందించడానికి అంబులెన్స్ సౌకర్యాలు కూడా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా సేవలు ఉన్నాయని గ్రామస్తులకు తెలిపారు. అనంతరం క్యాంపులో పీపుల్స్ హాస్పిటల్ సంబంధించిన క్యాలెండర్ను కూడా ఆవిష్కరించారు.