calender_icon.png 9 January, 2026 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్తు ప్రజా బాటను సద్వినియోగం చేసుకోవాలి

08-01-2026 05:21:12 PM

ఎస్సీ మల్చూరు నాయక్

కాటారం,(విజయక్రాంతి): విద్యుత్తు సమస్యలపై ప్రజలు తమ వినతులు సమర్పించేందుకు ఏర్పాటుచేసిన ప్రజా బాట కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ ఎస్ఇ మల్చూర్ నాయక్ కోరారు. గురువారం కాటారం మండలం ప్రతాపగిరిలో విద్యుత్తు ప్రజాపాట నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ ఈ హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామ సర్పంచ్ ఊర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వరకు నూతనంగా విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరారు. వీధులలో వదులుగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయాలని సూచించారు.