30-12-2025 02:05:20 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్29( విజయ క్రాంతి):జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 10 మంది విద్యార్థులు, మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్న 8 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు.వరంగల్ జిల్లాలో ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు జరగనున్న సీనియర్ బాలబాలికల రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో వీరు పాల్గొననున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కనక కర్నూ తెలిపారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను డీవైఎస్‌ఓ అష్ఫాక్ అహ్మద్, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్. రమాదేవి, ఆసిఫాబాద్ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి దుర్గం గురువేందర్, గిరిజన క్రీడల అధికారి మడవి షేకు, ఏసీఎంఓ ఉద్ధవ్, జీసీడీఓ శకుంతల, ఏటీడీఓ శివకృష్ణ, హెచ్డబ్ల్యూఓ మధుకర్, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శారద, పీడీలు మధుసూదన్, హారిక, కోచ్లు రాకేష్, విద్యాసాగర్, తిరుమల్, అరవింద్, రవి, యాదగిరి తదితరులు అభినందించారు.