calender_icon.png 30 December, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు

30-12-2025 02:04:32 AM

ఇసుకను కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, డిసెంబర్ 29(విజయక్రాంతి): జిల్లాలో స్వర్ణ వాగుతో పాటు ఇతర నదుల్లో ఇసుక రవాణాపై ‘విజయక్రాంతి’ పత్రికలో స్వర్ణ వాగులో ఇసుక దొంగలు అనే శీర్షికన ప్రచురితమైన వార్తకు కలెక్టర్ అభిలాష అభినవ్ స్పందించారు. వాగుల్లోడి అక్రమ ఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు డబ్బులు స్వాధీనం చేసుకోవాలని సూచించారు. జిల్లా లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఇసుక, ఇటు క, ఇతర ముడి సామగ్రి కొరత లేదని కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం స్పష్టం చేశా రు.

ఇండ్ల నిర్మాణానికి అవసరమైన సామగ్రి తగినంత నిల్వ ఉందని, ఈ విషయం లో లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె ఒక ప్రకటనలో తెలిపా రు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి వినియోగించే ఇసుక, ఇటుకల విషయంలో ఎవ రైనా ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమాలకు పాల్పడినా వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చ రించారు. లబ్ధిదారులు ఇసుక, ఇటుక కొరతకు సంబంధించి వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని సూచించారు. ఎటువంటి సందేహాలకు తావు లేకుండా తమ ఇండ్ల నిర్మాణా లను త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ లబ్ధిదారులను కోరారు.