15 May, 2026 | 12:16 PM

గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 చొప్పున ఎంపిక చేయాలి

21-06-2024 12:15 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి అభ్యర్థుల వినతి

కరీంనగర్, జూన్ 20 (విజయక్రాంతి): గ్రూప్ మెయిన్స్‌కు ప్రిలిమ్స్ నుంచి 1:100 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసేలా చొరవ చూపాలని గురువారం పలువురు అభ్యర్థులు కరీంనగర్‌లో కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను కలిసి విన్నవించారు. నాలుగేళ్లలో మూడుసార్లు గ్రూప్ ప్రిలిమ్స్ నిర్వహించారని, అలా అయితే అభ్యర్థులు నష్టపో తారన్నారు. పోస్టులు అత్యధికంగా ఉన్నందున 1:50 చొప్పున అభ్యర్థులను మెయి న్స్‌కు ఎంపిక చేస్తే నిరుద్యోగులకు అన్యా యం జరుగుతుందని గోడు వెల్లబోసుకున్నారు. సమస్యపై బండి సంజయ్ సానుకూ లంగా స్పందించారని అభ్యర్థులు తెలిపారు.

అనంతరం కేంద్ర మంత్రిని నగర మేయర్ సునీల్‌రావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నగరపాలక సంస్థ చేపట్టిన అభివృద్ధి పనులపై మేయర్‌తో చర్చించారు. భేటీ అనంతరం నగర మేయర్ సునీల్‌రావు మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రితో చర్చించామన్నారు. నగరపాలక సంస్థలో సహచర కార్పొరేటర్‌గా పనిచేసి, రెండుసార్లు ఎంపీగా గెలిచి, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఎదిగిన బండి సంజయ్ ప్రయా ణం ఎందరికో స్ఫూర్తి దాయకమన్నారు.

కేంద్ర మంత్రిని కలిసిన వారిలో కార్పొరేటర్లు జితేందర్, బండ సుమ రమణారెడ్డి, కాసర్ల ఆనంద్, బీజేపీ నాయకులు ఉన్నారు. అలాగే బీజేపీ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి కేంద్ర మం త్రిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో పార్టీ నాయకులు చింతం శ్రీనివాస్, కిన్నెర అనిల్, గొట్టిముక్కుల తిరుపతిరెడ్డి, మాడిశెట్టి వెంకటేశం, గడ్డం అరుణ్, తొర్తి సంతోష్, కంది రాజేందర్ రెడ్డి, బుర్ర శ్రీనివాస్, చింతం వరలక్ష్మి ఉన్నారు.