15 May, 2026 | 10:54 AM

చింతలచెర్వులో నిలిచిన మట్టి తోలకాలు

21-06-2024 12:15 AM

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 20 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలోని చింతలచెరువు నుంచి అక్రమంగా మట్టి తరలుతున్నదని గురువారం ‘విజయక్రాంతి’లో ‘దొంగ ‘మన్ను’షులు’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి మట్టి తోలకాలను నిలిపివేశారు. కానీ అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో మాత్రం ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. అధికారుల అండదండలతోనే అధికారులు మట్టి తరలిస్తున్నారని, ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి చెరువు పరిధిలో జరిగిన అక్రమాలపై విచారణ చేయించి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.