బొగ్గు గనుల వేలం.. కార్మికులకు నష్టం
ఐఎన్టీయూసీ నేత జోగ బుచ్చయ్య
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 20 (విజయక్రాంతి): కేంద్రం బొగ్గు గనులను వేలం వేయడం ద్వారా కార్మికులకు తీరని నష్టం జరుగుతుందని ఐఎన్టీయూసీ నేతలు జోగ బుచ్చయ్య, ఏబూసి ఆగయ్య అన్నారు. గురువారం స్థానిక కేటీకే ఓసీ 2 పై సింగరేణి అధికారులకు వినతిపత్రాన్ని అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. బొగ్గు ప్రాజెక్టులన్నీ ప్రైవేట్ సంస్థలకు అప్పగించి ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేయడమే కేంద్ర లక్ష్యమని విమర్శించారు. సింగరేణిని ప్రవేట్‌పరం చేయబోమని ప్రకటిస్తూనే తెలంగాణాలోని బొగ్గు ప్రాజెక్టులను సింగరే ణికి కేటాయించకుండా వేలంలో పెట్టారని, సింగరేణి కూడా వేలంలో పాల్గొనాలని ఆంక్షలు పెట్టారని గుర్తు చేశారు. సింగరేణి కార్మికులకు హక్కులు, సౌకర్యాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. వారివెంట ఐఎన్టీయూసీ నాయకులు వేణు, మండ సంపత్, కృష్ణ, రాజయ్య, కొమురయ్య, భరత్, భద్రయ్య, సుధాకర్, సజ్జన స్వామి ఉన్నారు.






