15-11-2025 12:59:43 AM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అర్చరి జూనియర్స్, సీనియర్స్ సెలక్షన్స్ కిన్నెరసాని మోడల్ ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ నందు శుక్రవారం నిర్వహించినట్లు డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్ తెలిపారు. జిల్లాస్థాయి ఆర్చరీ జూనియర్ సీనియర్స్ సెలక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాలరావు అర్చరి అసోసియేషన్ ఆఫ్ ఇండియా డెవలప్మెంట్ కమిటీ మెంబర్ పుట్ట శంకరయ్య, ఒలంపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గిరిజన ఆర్చరీ సెలక్షన్స్ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మన్యంలో మారుమూల ప్రాంతంలో ఉన్న గిరిజన విద్యార్థుల కోసం జిల్లాలోని కిన్నెరసానిలో బాలురకు, కాచనపల్లిలో బాలికలకు స్పోర్ట్స్ స్కూల్స్ నిర్వహించ బడుతున్నాయన్నారు. అందులో విలువిద్యలో రాణించుటకు మంచి శిక్షణ ఇస్తున్నారన్నారు. జిల్లాలోని గిరిజన విద్యార్థులకు విలువిద్యలో రాణించుటకు కృషి చేయాలని ఇండియా డెవలప్మెంట్ కమిటీ మెంబర్ పుట్ట శంకరయ్యను కోరారు.