15-11-2025 12:59:32 AM
కరీంనగర్ క్రైమ్ నవంబర్14 (విజయ క్రాంతి)పురుషుల్లో వయస్సు పెరిగేకొద్దీ ప్రోస్టేట్ గ్రంధి పెరగడం ఒక సాధారణ సమస్యగా వైద్యులు చెబుతున్నారు. యశోద హాస్పిటల్ యూరాలజిస్ట్, అన్రాలజిస్ట్ & ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ అమన్ చంద్ర దేశ్ పాండే మాట్లాడుతూ, ఈ పరిస్థితిని వైద్యపరంగా బెనైన్ ప్రోస్టాటిక్ హైపర్ ప్లేసియా అని పిలుస్తారని తెలిపారు. ఇది క్యాన్సర్ కాకపోయినా, మూత్రం రావడంలో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని అన్నారు.
ప్రోస్టేట్ ఎందుకు పెరుగుతుంది అంటే వయస్సుతో హార్మోన్ మార్పుల కారణంగా, ముఖ్యంగా డి హెచ్ ఆర్ ప్రభావంతో ప్రోస్టేట్ కణాలు పెరుగుతాయని, ఇది సహజ ప్రక్రియ అయినప్పటికీ కొందరికి అధికంగా పెరిగి సమస్యలు కలిగిస్తుందని వివరించారు. ఈ లక్షణాలుమూత్ర ప్రవాహం నెమ్మదిగా రావడం, ఆపి రావడం, పూర్తిగా వెళ్ళలేదనే భావన, రాత్రిళ్లు పలుమార్లు మూత్రం రావడంచివర్లో చుక్కలుగా రావడం, లక్షణాలను వైద్యపరంగా వర్గీకరిస్తారు దీనికి చికిత్సలు కన్జర్వేటివ్ థెరపీ ప్రారంభ దశల్లో మందులు ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు.
ఆల్ఫా బ్లాకర్స్ ప్రోస్టేట్ కండరాలను సడలించి మూత్ర మార్గం విప్పవచ్చు హార్మోన్ నిరోధక మందులు ప్రోస్టేట్ పరిమాణాన్ని తగ్గిస్తాయి కొన్నిసార్లు రెండింటిని కలిపి వాడతారు.మందులు పని చేయని రోగులకు ఆధునిక చికిత్సలు అవసరం అవుతాయని తెలిపారు.ప్రచలితమైన శస్త్రచికిత్స పద్ధతి.ఎలక్ట్రిక్ కరెంట్తో అదనపు ప్రోస్టేట్ కణజాలాన్ని తొలగిస్తారు. కొన్నిసార్లు వంటి దుష్ప్రభావాలు ఉండవచ్చని చెప్పారు, ప్రోస్టేట్లోకి ఆవిరిని పంపి అదనపు కణజాలాన్ని కరిగిస్తారు.
డే-కేర్ ప్రొసీజర్ లోకల్ యానస్థీషియా చాలు లైంగిక సామర్థ్యం కాపాడబడుతుంది.త్వరగా జీవితంలోకి తిరిగి చేరవచ్చుచిన్న మెటల్ క్లిప్స్తో వైపులా లాగడం ద్వారా మూత్రం వెళ్లే దారి విప్పుతారు.తక్షణ ఫలితం క్యాథెటర్ అవసరం చాలా తక్కువ అదే రోజు ఇంటికి వెళ్ళవచ్చు లైంగిక సామర్థ్యం దెబ్బతినదు అని అన్నారు యశోద హాస్పిటల్ యూరాలజిస్ట్ డాక్టర్ అమన్ చంద్ర దేశ్ పాండే.