14 July, 2026 | 6:29 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ

14-07-2026 06:29 PM

.. ​పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్  హెచ్ఎం వి.నటరాజ్

​​వాంకిడి,(విజయక్రాంతి): ప్రస్తుత సమాజంలో బాలికలు, మహిళల భద్రతకు కరాటే ఎంతగానో తోడ్పడుతుందని, ప్రతి విద్యార్థిని ఆత్మరక్షణ విద్యలను నేర్చుకోవాలని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ వాంకిడి కలాన్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వి. నటరాజ్ అన్నారు. మంగళవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాల నందు కరాటే మాస్టర్ గా చాపిడి కుమార్ ను నియమిస్తున్నట్లు హెచ్.ఎం. నటరాజ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మారుతున్న కాలానికి అనుగుణంగా అమ్మాయిలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని, ముఖ్యంగా తమను తాము కాపాడుకునేందుకు కరాటే వంటి యుద్ధ విద్యలు అద్భుతంగా ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. విద్యార్థినుల్లో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకే ఈశిక్షణను,ప్రారంభిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కరాటే మాస్టర్ చాపిడి కుమార్ ను ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది అభినందించారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సంతోష్, పిలాటికల్ డైరెక్టర్ (పీడీ) విష్ణు, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.