14 July, 2026 | 6:51 PM

Breaking News

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •  

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం

14-07-2026 06:50 PM

కాప్రా ఎంఈఓ ఆజా మొయినుద్దీన్

జవహర్ నగర్,(విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే తమ లక్ష్యం అని కాప్రా మండల ఎఫ్ఎసి ఎంఈఓ ఆజా మొహినుద్దీన్ అన్నారు. నూతనంగా ఎన్నికైన కాప్రా మండల ఎఫ్ఎసి ఎంఈఓ ఆజా మోహినిద్దీన్ జవహర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయుల బృందం కలిసి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాజా మొయినుద్దీన్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపితం చేయాలని పదవ తరగతిలో 100% ఉత్తీర్ణతకు కృషి చేయాలని అన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు తోడ్పడతానని విద్యార్థులకు క్రీడలతో పాటు సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని చిన్నప్పటినుండే విద్యార్థులు మంచి నడవడికలో నడిచే విధంగా విద్యాబోధన చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు