03-02-2026 06:18:29 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): బిటిఎస్ తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో నేడు 3 వ సెమిస్టర్ పరీక్షలు మొదలయ్యాయి. పరీక్ష జరుగుతున్న గదులను ప్రిన్సిపల్ డా. సుధాకర్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెండో సంవత్సరం విద్యార్థులకు 3 వ సెమిస్టర్ పరీక్షలు నేటి నుండి 13 వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గం. ల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతున్నాయని అన్నారు. మొత్తం 163 మంది విద్యార్థులకు గాను 161 మంది పరీక్షలకు హాజరయ్యారని, ఇద్దరు గైర్హాజరయ్యారని తెలిపారు.