03-02-2026 06:21:12 PM
ఉప్పల్,(విజయక్రాంతి): అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాచారం సబ్ ఇన్స్పెక్టర్ మైబల్లి తెలిపిన వివరాల ప్రకారం మౌలాలి హౌసింగ్ బోర్డ్ లక్ష్మీ నగర్ లో నివాసం ఉంటున్న తన్నేరు గోపి(19) మల్లాపూర్ వెంకటరమణ కాలనీవాసం ఉంటున్న చంద్రశేఖర్ ల్యాబ్ టెక్నీషియన్ పనిచేస్తన్నాడు.
గత కొంతకాలంగా సి డోలు గ్రామం బీదర్ జిల్లా కర్ణాటక నుంచి గంజాయి కొనుగోలు చేసి మల్లాపూర్ ఉప్పల్ సూర్య నగర్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న సమాచారం మేరకు సిబ్బందితో మల్లాపూర్ సూర్య నగర్ వద్ద మాటువేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 104 గ్రాముల గంజాయి స్వాధీన చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. గంజాయి అమ్మకాలు కొనుగోలు చేసిన కఠిన చర్యలు తప్పవని మైబలి ఎస్సై తెలిపారు