15 June, 2026 | 7:05 PM

Breaking News

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •  

కిట్స్ కళాశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

19-12-2025 12:26 AM

కోదాడ, డిసెంబర్ 18:  కోదాడ లోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల లో గురువారం ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సువార్త చర్చి పాస్టర్ రవి కుమార్ పాల్గొని  విద్యార్థి నులకు దైవ సందేశం ఇచ్చారు. ప్రేమకు ప్రతి రూపం యేసు ప్రభువని, అందరు యేసు ప్రభువు సందేశాన్ని పాటించాలని, శాంతి మార్గాన్ని ఆచరించాలన్నారు, ఇతరులపై ప్రేమ, జాలి, కరుణ, చూపించాలని, సోదర భావంతో కలిసి మెలిసి జీవించాలన్నారు,

అనంతరం విద్యార్థినులతో కలసి కేక్ కట్ చేసి ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.విద్యార్థినులు ఆలపించిన భక్తి గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, అధ్యాపకులు, నరసింహ రావు, నాగరాజు, లక్ష్మణ్, అరుణ, ఝాన్సీ,  సంధ్య, కళ్యాణి, కిరణ్ కుమార్, వెంకట రత్నం, ప్రత్యుష, విద్యార్థి నులు పాల్గొన్నారు.