calender_icon.png 20 December, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిమిర్యాల గ్రామ ఉపసర్పంచ్‌గా బండ్ల సైదులు ఏకగ్రీవ ఎన్నిక

19-12-2025 12:25:22 AM

కోదాడ, డిసెంబర్ 18: కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల గ్రామంలో ఉపసర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. మాజీ సర్పంచ్ గుడిపూడి శ్రీకాంత్ నాయకత్వంలో, వల్లపూ దాసు సురేష్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన బండ్ల సైదులు ను గురువారం ఉపసర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వార్డు సభ్యులు బండ్ల సైదులుకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు.

ఉపసర్పంచ్గా ఎన్నికైన అనంతరం బండ్ల సైదులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా సర్పంచ్తో సమన్వయంతో పనిచేస్తానని అన్నారు.అనంతరం గ్రామస్తులు, పలువురు నాయకులు ఉపసర్పంచ్ బండ్ల సైదులుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్త గురవయ్య, వార్డు సభ్యులు దుద్దెల సునీత గోపి, నందిగామ స్వాతి రాజశేఖర్, గోడపూరి నాగేష్, వెలిశాల రవి, నాగవరపు జాన్, నాయకులు కలకొండ ఆదినారాయణతో పాటు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.