calender_icon.png 19 December, 2025 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల ‘తోరణం’..!

19-12-2025 12:27:35 AM

  1. పల్లెల్లో దీర్ఘకాలికంగా వేధిస్తున్న చిక్కుముడులు
  2. పడకేసిన అభివృద్ధి 
  3. కొత్త నాయకులు మీదే ఆశలన్నీ

ఎర్రుపాలెం, డిసెంబర్18 (విజయ క్రాంతి): దీర్ఘకాలికంగా గ్రామాలలో సర్పంచ్ పాలకమండలి పరిపాలన లేకపోవడంతో గ్రామాలలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామాలలో గ్రామ సర్పంచులు పాలకమండలి సభ్యులు గ్రామాల అభివృద్ధిలో కీలక భాగస్వామ్యంగా ఉన్నారు. గత సర్పంచులు పాలకమండలి సభ్యులు పదవీకాలం ముగిసిన దగ్గర నుండి గ్రామాలలో సరి అయిన పరిపాలన లేకపోవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లు, అభివృద్ధి పథకాలకు ఇచ్చే నిధులు ఆగిపోవడంతో గ్రామాలలో అభివృద్ధి కుంటుబడింది.

గ్రామపంచాయతీలకు కొత్త సర్పంచులు రావడంతో వారికి గ్రామాలలో అనేక సమస్యలు తో పాటు అభివృద్ధి పనులు , కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలను అమలుపరచడంలో కీలకం కానున్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం కూడా సర్పంచులు పాలక మండలి సభ్యులు లే గ్రామాల అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం కానున్నారు.సర్పంచ్ పాలకమండలి ఆధ్వర్యంలో గ్రామాలు అభివృద్ధిలో రూపురేఖలు మారనున్నాయి..                                                                           

మండలంలో కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ లు పాలకమండలి సభ్యులకు గ్రామాలు స్వాగతం పలుకుతూనే, వివిధ సమస్యలు  కూడా స్వాగతం పలుకుతున్నాయి. 31 గ్రామపంచాయతీలలో గత సర్పంచులు పాలక మండలి సభ్యులు పదవీకాలం ముగిసిన తర్వాత, దీర్ఘకాలికంగా గ్రామాలలో పరిపాలన లేక  అంతర్గత రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించడం, డ్రైనేజీ కాలువలలో కూడికలు తీయించడం , పారిశుధ్య పనులను చేయించడం , విద్యుదీకరణ పనులు, స్వచ్ఛమైన త్రాగు నీటి సౌకర్యం గ్రామాలలో ప్రజలందరికీ కల్పించడం, రైతులకు పంటలు పండించేందుకు సాగునీరు అందించడం, యువతకు, నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకాలను అందించడం, కొన్ని గ్రామాలలో సరియైన రోడ్లు వసతి లేకపోవడం,

గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించడం, బస్ షెల్టర్ నిర్మించడం, విద్య, వైద్యం, గృహం వసతి పేదలందరికీ అందుబాటులోకి తీసుకురావడం, కొన్ని గ్రామాలలో కోతుల బెడద వంటి సమస్యలు సర్పంచులకు దర్శనమిస్తున్నాయి.  కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన సర్పంచులు పాలక మండల సభ్యులు స్థానిక రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామ ప్రజలందరినీ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ గ్రామాల ప్రజలు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ  తమ పదవీకాలంలో గ్రామాలు రూపురేఖలు , మార్చాలని గ్రామ ప్రజలను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలని వారిని మనస్ఫూర్తిగా అభినందించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షిద్దాం.