ఉద్రిక్తతకు దారి తీసిన బీఆర్ఎస్ ధర్నా
44 జాతీయ రహదారిపై రాస్తారోకో
చెదరగొట్టిన మనోహరాబాద్ పోలీసులు
మనోహరాబాద్,(విజయక్రాంతి): రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం జాప్యం వహిస్తునందున ఫ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి రైతులు కార్యకర్తలతో కలసి చేసిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల ప్రకారం మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం దండుపల్లి పాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం పరిశీలించాడు.
రైతులకు ఏర్పదుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన జాతీయ రహదారి 44 బైఠాయించి ధర్నాకు దిగి ప్రభుత్వానికీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో సీఐ వెంకట రాజా గౌడ్ ఎస్ఐ సుభాష్ గౌడ్ లు సిబ్బందితో కలిసి ధర్నాను చెదరగొట్టగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
ధర్నా విరమణ చేయకుండా మొండిగా కూర్చోవడంతో కొద్దిగా తోపులాట జరిగింది. అనంతరం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రైతుల పట్ల ప్రభుత్వం వహిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండు రోజుల్లో ధాన్యం తరలింపు పూర్తి కాకపోతే వెయ్యిమందితో జాతీయ రహదారి నిర్బంధం చేస్తామని హెచ్చరించారు. మండల పార్టీ అధ్యక్షుడు ఇమంపూర్ శేఖర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, అర్జున్, బిక్షపతి, సర్పంచి సాయి కుమార్, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.






