calender_icon.png 28 September, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి సీనియర్ నాయకులు ఆరె కాశీనాథంకి మాతృవియోగం

28-09-2025 07:40:37 PM

చిలుకూరు: అయోధ్య రామ మందిర నిర్మాణ కరసేవకుని ఆరె కాశీనాథం మాతృమూర్తి ఆరే శాంతమ్మ ఆదివారం పరమపదించరు. వారి మృతికి చిలుకూరు మండల భారతీయ జనతా పార్టీ సంతాపం ప్రకటించి నివాళులర్పించారు. శాంతమ్మ రెండున్నర దశాబ్దాల క్రిందటనే తమ కుమారులను రామ మందిర నిర్మాణానికి కరసేవకు పంపించినారని ఆ సమయంలో కుమారులు జైలు పాలైన నిరాశ పడకుండా కుమారుని ప్రోత్సహించి నేటి రామమందిర నిర్మాణం వరకు తమ కుమారులకు అండగా నిలబడిందని శాంతమ్మతో ఉన్న పరిచయాలను గ్రామ ప్రజలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పారెల్లి మహేష్, మండల జడ్పిటిసి ఎన్నికల కన్వీనర్ సిపిరిశెట్టి బసవయ్య, సీనియర్ నాయకులు కోడారు సుదర్శన్, మండల పార్టీ కోశాధికారి సీనియర్ నాయకులు మునుగంటి నాగ చారి పాల్గొన్నారు.