వృద్ధుల ఫిర్యాదులపై విచారణ
కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్
జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్
జగిత్యాల,ఆగస్టు 24(విజయక్రాంతి): తమను నిరాదరిస్తున్న కుమారులపై వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్ కు వివిధ గ్రామాల వృద్ధులు ఫిర్యాదులు చేశారు. ఆర్డీఓ ఆదేశాలతో శనివారం ఆర్డీఓ కార్యాలయంలో ఏఓ తఫజుల్ హుస్సేన్ విచారణలు నిర్వహించారు. జగిత్యాల మండలం పొలాస గ్రామానికి చెందిన గుగ్గిల్ల నర్సవ్వ, జగిత్యాల పట్టణానికి చెందిన గొల్లపల్లి ప్రసాద్ గౌడ్, ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన బైరం భూమమ్మ వివిధ గ్రామాల వృద్ధుల కుమారులు, కూతుర్ల, కొడళ్ల, అల్లుళ్ళ విచారించారు. సీనియర్ సిటీజేన్స్ అసోసియే షన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ విచారణకు ముందుగా వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న వారి కుమారులకు, కోడళ్లకు, కూతుర్లకు, అల్లుళ్ళకు 2007 సంరక్షణ చట్టం, నియమావళి 2011 , సెక్షన్ 24 పై సీనియర్ సిటీజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ కౌన్సిలింగ్ చేశారు. జగిత్యాల మండలం ధర్మారం గ్రామానికి చెందిన దండిగే లక్ష్మీ వృద్ధ తల్లి,తండ్రి బాలమల్లు ను పోషించకుండా కొడుతూ, చంపుతానని బెదిరింపులకు గురిచేస్తున్న వారి పెద్ద కొడుకు పై జగిత్యాల రూరల్ పోలీసు స్టేషన్లో సెక్షన్ 24 ప్రకారము ఎఫ్ఐఆర్ నెంబర్ 340/2024 తేదీ 29-7-2024 క్రిమినల్ కేసు నమోదు అయిందని, కోరుట్ల డివిజన్ లో ఒక కుమారునికి 6 మాసాల జైలు శిక్షకు అక్కడి ఆర్డీఓ విధించిన విషయాన్ని వివరిస్తూ ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు. విచారణకు హాజరు కాని వారిపై చట్టపర చర్యలు ఉంటాయని ఏఓ హెచ్చరించారు. ఈ విచారణలో సీనియర్ సిటిజెన్స్ కమిటీ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, ఎఫ్ఆర్ఓ కొండయ్య, సెక్షన్ సహాయకురాలు పద్మజ తదితరులు పాల్గొన్నారు.






